ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాదిరిగా రాజధానికో ఇల్లు కట్టుకునే స్తోమత పేద ప్రజలకు లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. పరిపాలన రాజధానిగా ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిని కొనసాగించడమే సబబని తెలియజేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు సముచిత నిర్ణయమన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు విశాఖపట్నంలో నిర్వహిస్తే బాగుంటుందన్నారు. రాయలసీమ, ఆంధ్ర ప్రజలకు వారధిగా ఉన్న దొనకొండలో రాజధాని ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పరిపాలన రాజధానిని రాయలసీమ ప్రజలకు దూరం చేయవద్దని సూచించారు. శివరామకృష్ణ కమిటీ నివేదిక రాకముందే గత ముఖ్యమంత్రి అమరావతి రాజధానిగా ప్రకటించారని... ప్రస్తుతం జీఎన్‌రావు నివేదిక రాకముందే ముఖ్యమంత్రి జగన్ రాజధానులను అసెంబ్లీలో ప్రకటించడాన్నిఆయన తప్పుబట్టారు. సొంత నిర్ణయాలతో రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని కోరారు.
ఇదీ చదవండి :