ETV Bharat / state

జొన్న పంట కొనుగోళ్లలో అక్రమాలు.. అధికారులకు ఫిర్యాదు

పంటే లేదు. కానీ దిగుబడి మాత్రం బ్రహ్మాండం. ఇంత దిగుబడి వస్తే, రైతులకు న్యాయం చేయాలి కాబట్టి టన్నుల కొద్దీ కొనుగోళ్లు చేశారు. పంటలేకపోతే కొనుగోళ్లు ఎలా అంటే... అది అంతే అంటారు గిద్దులూరు ప్రాంతంలో అధికారులు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రాథమిక సహకార పరపతి సంఘం సిబ్బంది చేతివాటానికి ఇదో నిదర్శనం.

maize crop illegal sales by komarolu pacs in kambham market yard
కొమరోలు పీఏసీఎస్ ద్వారా దాదాపు 23 వేల క్వింటాళ్ళ కొనుగోలు
author img

By

Published : Jul 7, 2020, 10:12 PM IST

వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం తరుపున కొనుగోలు చేస్తే రైతుకు గిట్టుబాటు ధరలు లభించడం, పండించిన పంటకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించినట్లు అవుతుంది. అందువల్ల మార్క్‌ఫెడ్‌ ద్వారా జిల్లాలో శనగలు, కందులు, మినుములు వంటివి కొనుగోలు చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది జొన్నలు కూడా కొనుగోలు చేపట్టారు. అదీ జిల్లా వ్యాప్తంగా 26 వేల క్వింటాళ్లు కొన్నారు. ఇందులో దాదాపు ఒక్క గిద్దలూరు నియోజకవర్గంలో కొమరోలు పీఏసీఎస్ ద్వారా దాదాపు 23 వేల క్వింటాళ్లు కొన్నారు. మార్క్‌ఫెడ్ నిధులతో ఈ కొనుగోళ్లు భారీగా సాగాయి. ఇందులో తప్పేముందని అనుకోవచ్చు.... అక్కడే మతలబు ఉంది...

గిద్దలూరు ప్రాంతంలో జొన్న పంట వేసింది బహు స్వల్పం. ఈ ప్రాంతంలో నాలుగు వందల హెక్టార్ల పంట కూడా లేదు. హెక్టార్‌కు 12, 13 క్వింటాళ్లకు మించి పంట రాదు. విస్తీర్ణం అంతా పంట దిగుబడి వచ్చినా... దాదాపు 5200 క్వింటాళ్లకు మించి ఉత్పత్తి వచ్చే అవకాశంలేదు. వాతావరణం సహకరించకపోవడం వల్ల పంట దిగుబడి రాలేదు. చాలావరకూ పశువుల మేతకే వినియోగించుకున్నారు. అలాంటిది కొమరోలు సొసైటీ ద్వారా కంభం మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో దాదాపు 23 వేల క్వింటాళ్ల జొన్నలు కొనుగోళ్లు చేపట్టారు.

పంటలేకపోయినా ఇంత భారీ స్థాయిలో కొనుగోళ్లు జరపడంపై తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పంటంతా కర్నూలు, గుంటూరు ప్రాంతాల్లో కొంత మంది వ్యాపారులు తీసుకువచ్చి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేశారు. బయట మార్కెట్​లో క్వింటాలు రూ. 1500కు మించి ధర లేదు. ఈ కొనుగోలు కేంద్రంలో దాదాపు రూ. 2550 చొప్పున కొన్నారు. అంటే ఒక క్వింటాపై దాదాపు వెయ్యి రూపాయల లాభానికి కొన్నారు. ఈ అక్రమ లావాదేవీలన్నిటికీ కొమరోలు సొసైటీలో ఓ ఉద్యోగి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాల నుంచి తీసుకువచ్చిన జొన్న పంట కంభంలోని ఓ ప్రైవేట్‌ విద్యా సంస్థలో, కొన్ని మిల్లుల్లో, గోదాముల్లో ఉంచి వీటినే రైతులు పేర్లు మీద కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ పంట నమోదైన రైతులకే కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులు అమ్ముకోడానికి వీలవుతుంది. అయితే జొన్నలు విషయంలో ఈ క్రాప్‌ లేకపోయినా కొనుగోలు చేయవచ్చునని సడలింపు ఇచ్చారు. కేవలం రైతు ఆధార్​ కార్డు ఉంటే సరిపోతుందని అనడాన్ని ఆసారాగా చేసుకొని ఈ తంతు నడిపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పలువురు... జిల్లా అధికారులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి : మార్క్​ఫెడ్​ ద్వారా పొగాకు కొనుగోలుపై నెల్లూరు జిల్లా రైతుల హర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.