మహాత్మాగాంధీ ఆశయాలను స్పూర్తిగా తీసుకొని ప్రతీ ఒక్కరూ సమాజ అభివధ్ధికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు గాంధీ రోడ్డులో నిర్వహించిన గాంధీ 150 జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి మహాత్మునికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలలు గాంధీ వేషధారణతో ఆకట్టుకున్నారు.
కనిగిరిలో కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలంయంలో ప్లాస్టిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను సర్వశిక్షా అభియాన్ జిల్లా సమన్వయ కర్త కొండారెడ్డి వివరించారు. ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేస్తామంటూ విద్యార్థులు ప్రమాణం చేశారు.