ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం తిమ్మనపాలెం గ్రోత్ సెంటర్ వద్ద.. ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. మధ్యప్రదేశ్‌కి చెందిన సంజీవ్ యాదవ్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి చంపేశారు. సంజీవ్ గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లో పని చేసే ఇతర కార్మికులను విచారించారు.
ఇదీ చదవండి: గసగసాల కేసులో మరో ఇద్దరి అరెస్టు