ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద రైల్వేట్రాక్‌పై ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఒంగోలు మండలం కొప్పోలుకు చెందిన విష్ణు వర్ధన్‌రెడ్డి, వెంకటేశ్వర కాలనీకి చెందిన నాగినేని ఇందు కొద్ది రోజులుగా ప్రేమించుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు.
పెళ్లికి పెద్దలు అంగీకరించరేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. విష్ణు వర్ధన్‌రెడ్డి ఇంజినీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థి. ఇందు డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని. ఇద్దరి మృతదేహాలు రైలు కింద పడిన తీరుకు.. శరీర భాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: