కరోనా వైరస్ కారణంగా ఒకవైపు.. పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగా మరోవైపు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అత్యవసర సమావేశం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరలు లారీ యజమానులకు వణకు పుట్టిస్తున్నాయని అన్నారు. దీనికి తోడు రోడ్ టాక్స్లు, టోల్ టాక్స్లు .. మరింత కుంగతదీస్తున్నాయని వాపోయారు. రవాణా రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్పై వసూలు చేసే అదనపు సుంకాన్ని తగ్గించి రవాణా రంగాన్ని రక్షించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చూడండి. దిల్లీకి వైకాపా ఎంపీ బాలశౌరి.. కేంద్ర మంత్రులతో 'కీలక' అంశాలపై చర్చ!