ETV Bharat / state

పెట్రోల్​ బంక్​ వద్ద లారీ దగ్ధం.. మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది - lorry fire accidents in prakasam news

పెట్రోల్​ బంకు వద్ద డీజిల్​ పట్టే సమయంలో ఓ లారీలో మంటలు చెలరేగిన ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరులో జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. బంకు వద్దే ప్రమాదం జరగటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

పెట్రోల్​ బంకు వద్దే లారీ దగ్ధం.. స్థానికుల ఆందోళన

author img

By

Published : Aug 17, 2020, 8:49 PM IST

Updated : Aug 17, 2020, 9:11 PM IST

పెట్రోల్​ బంకు వద్దే లారీ దగ్ధం

ప్రకాశం జిల్లా టంగుటూరులోని భారత్​ పెట్రోల్​బంకు వద్ద ఓ తౌడు లారీ అగ్నికి ఆహుతయ్యింది. తమిళనాడుకు వెళ్తూ.. డీజిల్​ పోయించుకునేందుకు పెట్రోల్​ బంకు వద్దకు రాగా లారీ మంటలు చెలరేగాయి. లారీ టైర్​ పంక్చరై.. ఆయిల్​ ట్యాంకు నేలకు తగిలి రాపిడితో నిప్పు చెలరేగి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని మంటలార్పారు. పెట్రోల్​ బంకు వద్దే లారీ దగ్ధం కావడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒంగోలు డీఎస్పీ ప్రసాదరావు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.

ఇదీ చూడండి..

దారుణం: కారులో ముగ్గురు ఉండగానే నిప్పంటించిన వ్యక్తి

Last Updated : Aug 17, 2020, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.