ETV Bharat / state

కరోనా నివారణకు సరికొత్తగా ఫేస్ మాస్కులు - ప్రకాశం జిల్లాలో లాంగ్ మాస్క్ తయారీ

కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ మాస్కుల డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో ఓ హాస్పిటల్ ఎండీ సరికొత్తగా ఫేస్ మాస్క్​ను తయారు చేశారు.

Long mask
Long mask
author img

By

Published : May 21, 2020, 3:53 PM IST

కరోనా వ్యాప్తి చెందకుండా ప్రకాశం జిల్లా చీరాలలోని శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ ఎండీ తాడివలస దేవరాజు ప్రత్యేక ఫేస్ మాస్క్​ను తయారు చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు నడపటంతో పాటు అన్ని రకాల వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి.

ప్రజలు మరింత రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. కరోనా వ్యాప్తి చెందిన విధుల్లో ఉంటున్న పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలో మాస్కుల పాత్ర కీలకమైనది. దీనిని దృష్టిలో పెట్టుకొని దేవరాజు స్వయంగా ఈ మాస్కులు తయారు చేశారు. ఇవి పూర్తి పారదర్శకంగా ఉండటంతో పాటు కళ్ళు, ముక్కు, నోరు, చెవులకు రక్షణ కల్పిస్తాయి. దీంతో బయట తిరిగే సమయంలో ఎవరైనా తుమ్మినా, దగ్గినా వాటి తుంపర్లు ఈ మాస్క్ ధరించడంతో దరిచేరవు.

ఇందులో మరో సౌలభ్యం ఉంది. వీటిని ఎప్పటికపుడు డెటాల్, శానిటైజరుతో శుభ్రం చేసుకుని తిరిగి ఉపయోగించవచ్చు. వీటిని పెద్ద మొత్తంలో తయారు చేసి ఆయా వర్గాలకు అందజేయాలని దేవరాజు ఆలోచిస్తున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.