లాక్డౌన్లో భాగంగా పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. పలుమార్లు హెచ్చరించినా...మాట వినకుండా రోడ్డుపైకి వచ్చే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా...ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులతో పోలీసులు గుంజీలు తీయించారు. మీకోసం రాత్రనకా, పగలనకా కాపలా కాస్తుంటే మీరు బాధ్యత మరిచి నింబధనలు అతిక్రమిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలందరూ లాక్డౌన్కు సహకరించాలని, లేకపోతే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీచదవండి