ETV Bharat / state

లాక్ డౌన్ ఆంక్షలు అమలు: ఒంగోలు నగరం నలువైపులా దిగ్భంధం - ప్రకాశం జిల్లా వార్తలు

ఒంగోలు పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మరోసారి సంపూర్ణ లాక్​డౌన్ అమలు చేస్తున్నారు. పట్టణంలో 14 కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి కూడళ్లలో బ్యారికేడ్లు నిర్మించారు. దుకాణాలు పూర్తిగా మూసివేశారు. కూరగాయలు, పాలు వంటి నిత్యావసరాల కొనుగోలు కోసం ఉదయం 9 గంటల వరకు అనుమతిస్తున్నారు.

lock down
lock down
author img

By

Published : Jun 22, 2020, 2:13 PM IST

కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా ఆదివారం నుంచి ఒంగోలు నగరంలో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. నగరంలోకి వచ్చే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులను ఆదివారం ఉదయం నుంచి మూసివేశారు. మంగమ్మ కళాశాల, పాత జడ్పీ సెంటర్‌, పేర్నమిట్ట, కొప్పోలు, మర్రిచెట్ల కాలనీ ప్రాంతాల్లో సరిహద్దు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి నగరంలోకి వాహనాలు ప్రవేశించకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు.

వీటితో పాటు నగరంలోని నెల్లూరు బస్టాండ్‌, కొత్తపట్నం బస్టాండ్‌, చర్చి సెంటర్‌, అద్దంకి బస్టాండ్‌, మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం, బైపాస్‌ ఫ్లైఓవర్‌, మంగమూరు రోడ్డు కూడలి, ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతాలను బారీకేడ్లతో మూసివేశారు. ఆయా ప్రాంతాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 333 మందికి వైరస్‌ సోకగా.. ఇందులో 140 మంది కోలుకున్నారు.

ఇదీ చదవండి:

సరిహద్దు ఉద్రిక్తతపై మరోసారి భారత్​- చైనా భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.