కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రకాశం జిల్లా చీరాల సాల్మన్ సెంటర్, నవాబుపేటలోని 350 కుటుంబాలకు చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఎం. గ్రెగోరి ఆధ్వర్యంలో ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అదేశాల మేరకు... పేదలకు తమ వంతుగా కూరగాయలు పంపిణీ చేశామని గ్రెగోరి తెలిపారు. జిల్లాలోని యర్రగొండపాలెంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల తర్వాత ప్రజలెవ్వరూ బయటకు రావటానికి వీల్లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: