ETV Bharat / state

ఎన్నికల వేళ పల్లెలకు పొరుగు రాష్ట్రాల మద్యం - పంచాయతీ ఎన్నికలు 2021 న్యూస్

ఒక వైపు పంచాయతీ ఎన్నికల సందడి నెలకుంటే.. మరో వైపు ఇదే అవకాశంగా అనధికారిక మద్యం అమ్మకాలకు అక్రమార్కులు తెరలేపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మద్యం వరదలా పల్లెల్లోకి చేరుతోంది.ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించే సరిహద్దుల్లో పటిష్ఠమైన నిఘా లేకనే పెద్దఎత్తున పొరుగు రాష్ట్రాల మద్యం జిల్లాలోకి ప్రవేశిస్తోందనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు పశ్చిమ ప్రకాశం, కొండపి, చీరాల ప్రాంతాల్లో సారా తయారీ బట్టీలు ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఎస్‌ఈబీ అధికారులకు సవాలుగా మారాయి.

ఎన్నికల వేళ పల్లెలకు పొరుగు రాష్ట్రాల మద్యం

author img

By

Published : Feb 4, 2021, 4:38 PM IST

మద్యం మత్తులో పల్లెపోరు: నాలుగు విడతలుగా జరిగే ఎన్నికల్లో అనధికారిక మద్యం అమ్మకాలను నియంత్రించడం కష్టతరంగా మారింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు గ్రామాల్లో మద్యం అనధికారిక అమ్మకాలు విఘాతాన్ని కలిగిస్తున్నాయి. మద్యం మత్తులో అధిక శాతం మంది గొడవలకు దిగుతుండటంతో పోలీసులకు తలనొప్పిగా మారింది.

ప్రలోభాలకు ఇదే ఆయుధం

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం ప్రధాన వనరు. చాలా మంది నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు నామినేషన్లు వేసిన రోజు నుంచే మద్యం సరఫరా చేస్తుంటారు. సారా, అనధికారిక మద్యం సేకరించి.. ఓటర్లకు పంచడం ద్వారా వారి ఓట్లను రాబట్టుకునేందుకు నాయకులు పావులు కదుపుతున్నారు. పార్టీ రహితంగా ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. ప్రధాన పార్టీల మద్దతుదారులు.. మద్యం లేనిదే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సెబ్‌ అధికారులు అద్దంకి సమీపంలో కుట్టవారిపాలెం, యర్రగొండపాలెం సమీపంలో మిల్లంపల్లి టోల్‌ప్లాజా వద్ద, దోర్నాల- శ్రీశైలం రహదారిని జిల్లా సరిహద్దు ప్రాంతాలుగా గుర్తించి చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా అడ్డదారుల్లో మద్యం పల్లెలకు చేరుతూనే ఉంది.

తెలంగాణ నుంచే అత్యధికం.. : తెలంగాణ నుంచి జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న మద్యమే అధికంగా ఉంది. సెబ్‌ అధికారుల దాడుల్లో దొరుకుతున్న వాటిలో తెలంగాణ మద్యం కేసులే అధికంగా ఉన్నాయి. ఇటీవల 1,104 (23 కేసులు) మద్యం సీసాలను రెండు కార్లలో తరలిస్తుండగా త్రిపురాంతకం వద్ద అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో ఏపీ సరిహద్దులోని విజయపురి సౌత్‌ గుంటూరు జిల్లా చెక్‌పోస్టులో పనిచేసే ఓ కానిస్టేబుల్‌ ఉన్నట్లు సెబ్‌ అధికారుల విచారణలో తేలింది. పోలీసు సిబ్బందే మద్యం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఫిబ్రవరి 1న అద్దంకిలో గ్రామపోరు సమీపిస్తుండడంతో ముఠాగా ఏర్పడిన కొందరు వ్యక్తులు 60 మద్యం సీసాలను ప్రభుత్వ మద్యం దుకాణంలో కొనుగోలు చేసి కారులో తరలిస్తుండగా సెబ్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో అయిదుగురిని అరెస్టు చేసి.. కారును స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా పంచలింగాల వద్ద ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన వ్యక్తి కారులో 1,008 మద్యం సీసాలు తరలిస్తుండగా కర్నూలు జిల్లా సెబ్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ నెల 2న మార్కాపురం యూనిట్‌ పరిధిలో పుల్లలచెరువు మండలం అక్కపాలెం రహదారి మార్గంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 250 లీటర్ల సారాను సెబ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 21,900 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు.

ఎన్నికల వేళ పల్లెలకు పొరుగు రాష్ట్రాల మద్యం
ఎన్నికల వేళ పల్లెలకు పొరుగు రాష్ట్రాల మద్యం

అక్రమ రవాణాకు అడ్డుకట్టవేస్తాం

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల మద్యం మన జిల్లాలోకి రాకుండా అడ్డుకుంటున్నాం. అనుమానితులపై బైండోవర్‌ కేసులు నమోదు చేశాం. 43 గ్రామాల్లో సారా తయారీ అధికంగా ఉన్నట్లు గుర్తించి ఆయా కేంద్రాలపై దాడులు ముమ్మరం చేశాం. సారా ముడిసరకు విక్రయాలనూ నిలువరిస్తున్నాం. - వై.శ్రీనివాస్‌చౌదరి, సెబ్‌ సహాయ కమిషనర్‌, ఒంగోలు

ఇదీ చదవండి: 2019 ఓటర్ల జాబితాపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లు కొట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.