ETV Bharat / state

ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు కోసం లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ లైన్​మెన్​ - దర్శి మండలం

వ్యవసాయ ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు కోసం రైతుల నుంచి లంచం తీసుకుంటున్న ఓ లైన్​మెన్​ని ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేశారు. ట్రాన్స్​ఫార్మర్​ కోసం ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లిలోని రైతులు లైన్​మెన్​ని ఆశ్రయించగా.. లక్ష రూపాయలు డిమాండ్​ చేశారు. అప్పటికే రూ. 50 వేలు చెల్లించారు. అయినా ట్రాన్స్​ఫార్మర్ ఏర్పాటులో లైన్​మెన్ నాయక్ ఆలస్యం వహిస్తుండటంతో విసుగు చెందిన రైతులు అవినీతి నిరోధక శాఖ ఫిర్యాదు చేశారు. పథకం ప్రకారం మిగతా డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆ లైన్​మెన్​ను పట్టుకున్నారు.

linemen caught red handedly by taking bribe
ఏసీబీకి పట్టుబడ్డ లైన్​మెన్​
author img

By

Published : Jan 11, 2021, 7:47 PM IST

ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామంలోని రైతులకు ట్రాన్స్​ఫార్మర్(విద్యుత్ పరివర్తకం) ఏర్పాటు కోసం రూ.51000 లంచం తీసుకుంటుండగా లైన్​మెన్ నాయక్ ను ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. గ్రామంలోని తొమ్మిదిమంది రైతులు కలసి రెండు వ్యవసాయ ట్రాన్స్​ఫార్మర్​ల కోసం గ్రామ లైన్​మెన్​నాయక్​ని ఆశ్రయించగా.. లక్ష రూపాయలు అవుతుందని తెలిపారు. మొదటి విడితగా 50వేల రూపాయలు రైతులు లైన్​మెన్​కు చెల్లించారు. డబ్బులు తీసుకున్న అనంతరం ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు చేయటంలో లైన్ మెన్ నాయక్ ఆలస్యం వహిస్తుండటంతో విసుగు చెందిన రైతులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం ఏసీబీ అధికారులు రాజంపల్లి చేరుకుని ఓ రైతు ఇంట్లో మాటువేసి రైతు వద్దనుంచి లైన్ మెన్ నాయక్ మిగతా 51000 రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం నాయక్​ను విచారించి అరెస్టు చేసినట్లుగా ఏసీబీ డీఎస్పీ సూర్య నారాయణ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: సత్తా చాటుతున్న ఒంగోలు గిత్తలు.. విజయవాడలో ఉత్సహంగా బల ప్రదర్శన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.