ETV Bharat / state

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వామపక్షాల ఆందోళనలు - విజయనగరంలో రైతులకు మద్దతుగా వామపక్షాల ఆందోళనలు

దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాలకు నిరసనగా.. రాష్ట్రంలో వామపక్షాలు నిరసన చేపట్టాయి. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. . కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుతో పాటు విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రైతు ఉద్యమాలకు నిరసనగా వామపక్షాల ఆందోళనలు
author img

By

Published : Dec 12, 2020, 3:36 PM IST

Updated : Dec 12, 2020, 4:54 PM IST

కేంద్రం తెచ్చిన చట్టాలతో వ్యవసాయం మొత్తం కార్పొరేట్ల మయం అయిపోతుందని.. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష నేతలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గుంటూరు, కృష్ణా జిల్లాల్లో

అఖిల భారత రైతుసంఘాల సమాఖ్య పిలుపు మేరకు గుంటూరు జిల్లా కాజ, కృష్ణా జిల్లా పొట్టిపాడు టోల్ ప్లాజాల వద్ద వారు ఆందోళనకు దిగారు. తెదేపా సహా పలు ఇతర రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు వారికి మద్దతుగా నిలిచాయి. పోలీసులు కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనన్న నేతలు.. లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతుల సహజ హక్కుల్ని బడాబాబుల చేతుల్లో పెడుతున్న మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తక్షణం రద్దు చేయాలని సీపీఐ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వామపక్షాల ఆందోళనలు

తూర్పుగోదావరిలో

రైతు, కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో... తూర్పుగోదావరి జిల్లా కృషవరం టోల్ ప్లాజా ముట్టడికి పిలుపునిచ్చారు. వామపక్షాలు ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.

Leftist parties protest in state supporting farmers agitation in delhi
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తూర్పుగోదావరిలో వామపక్షాల ఆందోళనలు

పశ్చిమగోదావరిలో

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రాజధాని సరిహద్దులు గత 15 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులకు సంఘీభావంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద జాతీయ రహదారిపై ఉన్న టోల్గేట్ వద్ద రైతు, కౌలు, రైతు, కార్మిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేయకపోతే పోరాటాన్ని మరింత ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పశ్చిమగోదావరిలో వామపక్షాల ఆందోళనలు

శ్రీకాకుళంలో

దిల్లీలో రైతులు చేస్తున్న నిరసనకు మద్దతుగా.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జాతీయ రహదారి చిలకపాలేం టోల్ గేట్ వద్ద వామపక్షాలు ఆందోళనలు చేపట్టారు. రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా బిల్లులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

జిల్లాలోని నరసన్నపేట మండలం మడపాం టోల్గేట్ వద్ద కిసాన్ సంఘర్షణ కో-ఆర్డినేషన్ కమిటీ పిలుపుమేరకు... పలు కార్మిక రైతు సంఘాలు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు .

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని శ్రీకాకుళం జిల్లాలో వామపక్షాల ఆందోళనలు

విజయనగరంలో

విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారి నాతవలస టోల్ ప్లాజా వద్ద.. వ్యవసాయ వ్యతిరేక బిల్లుకు నిరసనగా వామపక్ష నేతలు ఆందోళనలు చేపట్టారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, రైతు సంఘాలు ఇతర నేతలు టోల్ ప్లాజా వద్ద మోకాళ్లపై కూర్చుని నినాదాలు చేశారు. భాజపా ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. రైతులకు అన్యాయం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నుతోందని... భవిష్యత్తులో రైతుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగులుతుందని విమర్శించారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విజనయగరంలో వామపక్షాల ఆందోళనలు

ప్రకాశంలో

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాలకు నిరసనగా... ప్రకాశం జిల్లాలో వామపక్షాలు నిరసన కార్యక్రమాలు చెపట్టాయి. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. జిల్లాలోని టంగుటూరు, బొబ్బేపల్లి టోల్ ప్లాజాల వద్ద అఖిల భారత రైతు సంఘాలు, వామ పక్షాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని నిరసన చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును తక్షణం రద్దు చేయాలని, దిల్లీలో నిరసనలు చేస్తున్న రైతులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను నెరవేర్చాలన్నారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రకాశం జిల్లాలో వామపక్షాల ఆందోళనలు

కర్నూలులో

రైతు చట్టాలు సహా విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కర్నూలు జిల్లాలోని నన్నూరు టోల్ గేట్ వద్ద వ్యవసాయ, కార్మిక, విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కర్నూలు జిల్లాలో వామపక్షాల ఆందోళనలు

కడపలో

రైతులను రైతు కూలీలుగా మార్చే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... కడప శివారులోని అలంఖంపల్లి టోల్ గేట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన చట్టాల వల్ల రైతులు నట్టేట మునిగిన పోతారని ఆరోపించారు. రైతులతో చర్చించకుండానే బిల్లులను ఆమోదించటం దారుణమన్నారు. రైతులకు ఇబ్బందులకు గురిచేసే ఈ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని... లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కడప జిల్లాలో వామపక్షాల ఆందోళనలు

అనంతపురంలో

వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల రవాణా వాహనాలకు టోల్ రుసుం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఓబుల కొండారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా మరూరు టోల్ ప్లాజ వద్ద... రైతు సంఘాల సమాఖ్య సంఘాలన్నీ అన్నదాతలతో కలిసి ఆందోళన నిర్వహించింది. పంట దిగుబడులను మార్కెట్ కు తరలించే వాహనాలకు టోల్ గేట్ల వద్ద రుసుం రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు తీవ్ర నష్టం చేకూర్చే నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని వారు డిమాండ్ చేశారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అనంతపురంలో వామపక్షాల ఆందోళనలు

ఇదీ చదవండి:

వీడియో: కాజ టోల్​ గేట్​ ఘటనపై రేవతి ఏమన్నారంటే..?

Last Updated : Dec 12, 2020, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.