ప్రకాశం జిల్లా అద్దంకి రహదారిపై నల్లవాగు సమీపంలో బాతుల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. సుమారు 9 వేల బాతుపిల్లలు మృతి చెందాయి. వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు తరలించారు. చనిపోయిన బాతుల విలువ 4 లక్షల రూపాయలు ఉంటుందని యజమానులు తెలిపారు.
కావలి నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వివరించారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
ఇది చదవండి పంచనామా నుంచి నేరుగా.. శ్మశానానికే!