ETV Bharat / state

ఒంగోలు ఇళ్ల స్థలాల వివాదం... కోర్టులో మలుపులు - ongole news

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన స్థలం వివాదానికి కేంద్రం బిందువుగా మారింది. గతంలో ఓ మైనింగ్‌ కంపెనీకి లీజుకు ఇచ్చిన యర్లజర్ల కొండ ప్రాంతాన్ని.. ఇళ్ల స్థలాలు కేటాయించారు. లీజుకు ఇచ్చిన స్థలంలో ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారంటూ పలువురు కోర్టుకు వెళ్లారు. దీంతో ఇళ్ల స్థలాల కోసం చదును చేసి లేఔట్‌ వేసిన 700 ఎకరాలు వివాదంలో చిక్కుకున్నాయి. రైతుల పేరిట హైకోర్టులో పిటిషన్​ దాఖలు వేయగా.. ఆ పేర్లు గల రైతులు పిటీషన్ తామువేయలేదని కోర్టుకు తెలిపారు.

ఒంగోలు ఇళ్ల స్థలాల వివాదం... కోర్టులో మలుపులు

author img

By

Published : Jul 6, 2020, 8:19 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో పేదల ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు... యర్లజర్ల వద్ద అధికారులు స్థలాన్ని కేటాయించారు. ఇక్కడున్న ప్రభుత్వం స్థలం 1300 ఎకరాల్లో.. దాదాపు 700 ఎకరాలను గుర్తించి, సుమారు 21 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలోనే అతి పెద్ద లేవుట్‌గా తీర్చిదిద్ది అందరికీ పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ స్థలంపై కోర్టు వివాదం నెలకొంది. యర్లజర్ల, సర్వేరెడ్డిపాలెం, టంగుటూరు మండలంలోని మర్లపాడు, కొణిజేడు గ్రామాల మధ్య సుమారు 1300 ఎకరాలు ఉంది.

గతంలోనూ ఇలానే

గతంలో.. ఈ స్థలాన్ని ఐరన్‌ ఓర్‌ వెలికి తీసేందుకు మూడు కంపెనీలకు లీజ్‌కు ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇళ్ల పట్టాలు, ట్రిపుల్‌ ఐటీ కళాశాల కోసం ఈ ప్రాంతాన్ని గుర్తిస్తే కంపెనీలు లీజు తీసుకున్నందున అభ్యంతరం చెప్పడమే కాకుండా కోర్టుకు వెళ్లాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం సదరు కంపెనీలతో మాట్లాడి, ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకుంది. పైగా ప్రభుత్వం ఇచ్చిన లీజు స్థలంలో ఎలాంటి కార్యకలాపాలు జరగడంలేదు కాబట్టి, ప్రభుత్వ అసరాలకు వినియోగించుకునే విధంగా నిబంధనలు ఉన్నందున ఇళ్ల స్థలాలకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. భారీ స్థాయిలో స్థలాన్ని చదునుచేసి, లేఅవుట్‌ వేశారు. పట్టాలు పంపిణీకి సిద్ధం అవుతున్న సమయంలో ఈ స్థలంపై కోర్టులో పిటీషన్‌ దాఖలైంది.

  • రైతుల పేరిట పిటిషన్

ఖనిజాలు ఉన్న ప్రాంతాలన్నీ ఇతర అవసరాలకు వినియోగించకూడదని 2002 సంవత్సరంలో కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. ఏపీ మైనింగ్‌ కార్పొరేషన్‌.. ఈ ప్రాంతంలో ఇనుప ఖనిజం ఉన్నట్లు గుర్తించి, కేంద్రానికి లేఖ కూడా రాసింది. జాతి సంపదగా గుర్తించిన ఈ ప్రాంతాన్ని ఇతర అవసరాలకు, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఏపీ మైనింగ్‌ కార్పొరేషన్‌ ఎలా ఇస్తుందన్న వాదనతో కొంత మంది రైతులు కోర్టులో పిటీషన్ వేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈ నెల 2న హైకోర్టులో పిటీషన్‌ వేయగా, సోమవారం వాదనలు జరిగాయి.

  • తమకు తెలియదన్న రైతులు

పిటీషన్ వేసిన రైతుల్లో కొంతమంది తమకు ఈ పిటీషన్ విషయం తెలియదంటూ అధికారులకు చెప్పడంతో.. ఈ విషయాన్ని అధికారులు కోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. ఈ వ్యవహారం కోర్టులో ఉండడంతో యర్లజర్ల ఇళ్ల పట్టాలు పంపిణీపై ప్రతిష్టంభన నెలకొంది.

ఇదీ చదవండి : నాడు-నేడు పనులు వేగంగా పూర్తి చేయండి: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.