ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం ఎర్రబాలెం ఎస్సీ కాలనీలో అనపర్తి దీపిక(25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం... నాగులుప్పలపాడు మండలం బి.నిడమనురు గ్రామానికి చెందిన దీపికను కొరిసపాడు మండలం ఎర్రపాలెం గ్రామానికి చెందిన అవినాష్‌తో ఏడేళ్ల క్రితం వివాహం జరిపించారు. గతంలో వీరి మధ్య విభేదాలు వచ్చి కొరిసపాడు పోలీస్ స్టేషన్లో దీపిక బంధువులు ఫిర్యాదు చేశారు. పెద్ద మనుషుల రాజీతో మళ్లీ కలిసి జీవించారు.
శుక్రవారం రాత్రి 9:30 గంటల సమయంలో దీపిక.. తన తల్లి, సోదరుడితో ఫోన్ లో మాట్లాడింది. అనంతరం రాత్రి 10:30 గంటల సమయంలో దీపికకు ఆరోగ్యం బాగోలేదని తన తల్లిదండ్రులకు ఫోన్ వచ్చంది. దీపిక సోదరుడు 108కి సమాచారం అందించడం వల్ల సిబ్బంది వచ్చి మృతి చెందినట్లు నిర్ధారణ చేశారు. మృతురాలు గొంతుపై గాట్లు ఉండటం వల్ల మహిళ బంధువులు దీపిక భర్త అవినాష్ పై కొరిసపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: