ప్రకాశం జిల్లా ఎగువ ప్రాంతల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. నదీ పరివాహక ప్రాజెక్టులు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. సాగర్ జలాలు విడుదల చేయటంతో కుడికాలువ ఆయాకట్ట రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. త్రిపురాంతకం మండలంలో రెండు వారాలుగా వరినాట్లు ఊపందుకున్నాయి. కాలువల్లో నీటి ప్రవాహం 2,400 క్యూసెక్కులుగా వస్తోంది. సుమారు 10వేల ఎకరాల్లో వరినాట్లు వేశారు.అధికారికంగా వరికి నీరిస్తామని అధికారులు ప్రకటించక పోయిన ప్రాజెక్టులోకి వరద నీరు వస్తుండటంతో సాగు నీటికి కొరత ఉండదనే ధీమా రైతుల్లో నెలకొంది. దీంతో వరి సాగు పనులు జోరుగా సాగుతున్నాయి.
ఇదీ చదవండి:వరి నాట్లకు శ్రీకారం చుట్టిన రైతులు