ETV Bharat / state

కేన్సర్ బాధితులకు జుట్టు దానం చేసిన చిన్నారులు - kids donate hair for cancer patients news

కేన్సర్‌ రోగుల కోసం జుట్టు దానం చేసి తమ ఔదార్యం చాటారు ఆ ముగ్గురు చిన్నారులు. ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టును పెద్దమనసుతో కేన్సర్ బాధితులకు ఇచ్చి తమవంతు సాయం అందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచి నేర్పిస్తున్న మంచి బుద్ధులే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

kids donate hair
kids donate hair
author img

By

Published : Jun 3, 2020, 1:54 PM IST

ప్రవీణ్ కుమార్, ప్రశాంతి కుమారి దంపతులకు ముగ్గురు సంతానం. స్వస్థలం ప్రకాశం జిల్లా చీరాల మండలం సిపాయిపేట. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. చిన్నతనం నుండే మంచి వారికి బుద్ధులను నేర్పించారు. ఎదుటివారికి సాయం చేసే గుణం కలిగించారు. దీంతో ఆముగ్గురు చిన్నారులు చిరు ప్రాయంలోనే...తమ జుట్టును కేన్సర్ బాధితుల కోసం దానం చేశారు. ఈ ముగ్గురిలో గ్రేస్ ఎంజల్ 4 వ తరగతి, లూడ్స్ ఎంజల్ రెండో తరగతి, జొస్ క్రిస్ట్ ఎంజల్ ఒకటో తరగతి చదువుతున్నారు.

ఈ చిన్నారులు ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన పిలుపుతో స్పందించారు. కేన్సర్ భాదితులకు మనోధైర్యం నింపేందుకు తమ కురులను దానం చేశారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వచ్చిన హెయిర్ డొనేషన్ కార్యక్రమాలను చూశారు. ప్రేరణ పొంది హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఆఫ్ కేన్సర్ ఆర్గనైజేషన్ వారిని సంప్రదించారు. ఆ సంస్థ ప్రతినిధులు చీరాలకు వచ్చి ముగ్గురు బాలికల తల వెంట్రుకలను తీసుకెళ్లారు.

ఇలా చేసినందుకు దేవుడి ఆశీస్సులు వస్తాయని తమ తల్లిదండ్రులు చెప్పారని.. అందువల్ల కేన్సర్ బాధితులకు జుట్టు ఇచ్చామని బాలికలు చెప్పారు. ఐదు నెలల కిందట ఈనాడు వసుంధర పేజీలో కేన్సర్ బాధితులగురించి ఒక కథనం తమను ఆలోచింపచేసిందని చిన్నారుల తల్లిదండ్రులు చెపుతున్నారు. తమ పిల్లలు చేసిన మంచిపని మరికొందరికి స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: కార్యాలయాలకు రంగుల కేసుపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.