చీరాల తెదేపా ఎమ్మెల్యే కరణం బలరాం వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ వైకాపా తీర్థం పుచ్చుకోనున్నారు. ఇటీవలే అదే జిల్లా నుంచి కదిరి బాబురావు వైకాపాలో చేరారు. ఇప్పుడు బలరాం కూడా ఫ్యాను పార్టీలో చేరబోతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇవీ చదవండి.. తెదేపాకు బల'రామ్ రామ్'!.. ఒకటి రెండు రోజుల్లో స్పష్టత