Kanigiri Villagers Agitation: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు గ్రామస్థులు కనిగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పునుగోడు గ్రామంలో రెండు వర్గాల మధ్య భూమికి సంబంధించిన వివాదం నెలకొంది. దీనిపై గ్రామ పెద్దలు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగా, అధికార పార్టీకి చెందినవారు ఒక్కసారిగా ఎదుటి వర్గంపై దాడికి దిగారు. అయితే దాడి చేసిన వారిని వదిలేసి... దెబ్బలు తిన్నవాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ గ్రామస్థులు మండిపడ్డారు. మమ్మల్ని కొట్టి... మాపైనే కేసులు పెడతారా? అంటూ ట్రాక్టర్లలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. వారికి సర్దిచెప్పేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరికి అధికార పార్టీ వర్గీయులపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో పునుగోడు గ్రామస్థులు ఆందోళన విరమించారు.
ఇవీ చదవండి :