"కరోనా మహమ్మారిని తరిమి కొడదాం" అంటూ కనిగిరి ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ ప్రజల్లో అవగాహన కల్పించారు. కనిగిరిలోని ప్రధాన కూడళ్ళలో పాదయాత్ర చేస్తూ దుకాణాల వద్ద గుమిగూడవద్దని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా అనుమానిత లక్షణాలతో ఎవరైనా సంచరిస్తుంటే అధికారులకు తెలియజేయాలని కోరారు. లాక్ డౌన్ నేపథ్యంలో కుటుంబ పోషణ భారంగా ఉన్న వారికి ఉచిత బోజన వసతి కల్పిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: కరోనా సమయాన మగవారిలో 'వీర్యాందోళన'!