ప్రకాశం జిల్లాకు 83 మెట్రిక్ టన్నుల అరటి పళ్లను కడప జిల్లా నుంచి తీసుకువచ్చి డ్వాక్రా మహిళలు విక్రయిస్తున్నారు. కడప జిల్లాలో విస్తారంగా పండించే అరటిని అమ్ముకోలేక రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ కారణంగా రవాణా నిలిచిపోయి... వేలాది టన్నుల పండ్లను పారబోసే పరిస్థితి ఏర్పడింది. నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు... ప్రభుత్వం వివిధ జిల్లాలకు పండ్లను సరఫరా చేస్తోంది. ఒంగోలు మెప్మా ఆధ్వర్యంలో రైతు బజార్ వద్ద హోల్ సేల్ ధరకు అరటి పళ్ల విక్రయాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మహిళా సంఘాల ద్వారా వార్డుల్లో విక్రయిస్తున్నారు.
ఇదీ చూడండి: