రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన కబడ్డీ క్రీడాకారిణి గూడూరు అఖిలను వైకాపా నాయకులు ప్రణీత్ రెడ్డి, పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇన్ ఛార్జి రావి రామనాధం బాబు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు పరామర్శించారు. చినగంజాం మండలం పెదగంజాంలో ఉన్న ఆమె స్వస్థలంలో కలిసి రూ. లక్ష చెక్కును అందజేశారు.
ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అఖిలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వైకాపా నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. ఆమె ప్రమాద విషయం ఇటీవలె మంత్రి దృష్టికి వచ్చిందని.. అఖిలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చేందుకే తనను ఇక్కడకు పంపించారని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: