ఇటీవల కురిసిన వర్షాలకు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోమటికుంటలో నష్టపోయిన పంటలను జేడీఏ శ్రీరామమూర్తి పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో పత్తి ఎక్కువగా సాగు చేశారని.. వర్షాలతో ఒక్క క్వింటా చేతికి వచ్చే పరిస్థితి లేదని వాపోయారు.
జేడీఏ మాట్లాడుతూ.. జిల్లాలో తుపాను వలన పత్తి, వరి, మినుము, కంది, చిరుధాన్యాలు సుమారు లక్ష హెక్టార్లలో దెబ్బతిన్నాయన్నారు. రైతులు తమ పంటను ఈ క్రాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 50 శాతం పంట నష్టం వివరాలను నమోదు చేశామని తెలిపారు. మిగిలినవి పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
ఇవీ చదవండి..