స్థానిక సంస్థల ఎన్నికలు నిర్ణీత కాలంలో జరగాల్సిందేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కరోనాను సాకుగా చూపి ఎన్నికలు నిర్వహించకూడదని అనుకోవడం సరికాదని ప్రభుత్వానికి హితవు పలికారు. వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో వైకాపా నాయకులు ర్యాలీలు, పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.
మీరనుకున్నదే చట్టం అనుకుంటే ఎలా?. ఎంతకాలం సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఆపండి ఈ ఆట. స్థానిక ఎన్నికల్లో యువత నిలబడాలని అనుకుంటున్నారు. యువ నాయకులు రావాలి. కాబట్టి పంచాయతీ ఎన్నికలు జరగాలి. ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు- పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు
మరోవైపు ఎస్ఈసీ, న్యాయమూర్తులకు కులాలు ఆపాదించడమేంటని పవన్ మండిపడ్డారు. ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికలకు సహకరించాలని ఆయన కోరారు. మరోవైపు ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ వేయించి, వారిలో ఉన్న భయాన్ని పొగొట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి: