ETV Bharat / state

Irregularities in Voter List దుకాణానికి ఇంటి నంబర్.. 100కి పైగా ఓట్లు! నంబరే లేని ఇంట్లో ఏకంగా 280.. - Complaints about fake votes

Massive Irregularities in Voter List: ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇంటి నంబర్ల మీద వరుస క్రమంలో ఓటర్ల జాబితా ఉండాలి. కానీ వైసీపీ ప్రభుత్వం ఎక్కడా ఆ నియమాన్ని పాటించడం లేదు. ఒకే ఇంటి నంబరు మీద పదులు, వందల సంఖ్యలో ఓట్లు నమోదు చేస్తున్నారు.

irregularities_in_voter_list
irregularities_in_voter_list
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2023, 11:00 AM IST

Updated : Aug 28, 2023, 11:17 AM IST

Massive Irregularities in Voter List: ప్రజాస్వామ్యంలో నేతల రాతలు మార్చేదీ.. ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే. అటువంటి ఓట్లతో ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో కొంతమంది అధికార పార్టీ నేతలు చెలగాటమాడుతున్నారు. బీఎల్వో(BLO)లపై ఒత్తిడి తెస్తూ.. ఓట్ల జాబితాలను ఇష్టారీతిన మార్చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒకే ఇంటి నంబరుపై పదుల్లో.. మరికొన్ని చోట్ల అసలు ఇంటి నంబరే లేకున్నప్పటికీ.. ఓట్లను చేర్చేశారు. వీటిని గుర్తించి తొలగించాల్సిన యంత్రాంగం చేతులు కట్టుకుని చోద్యం చూస్తోంది.

Daggubadu Sarpanch Video on Votes Cancellation: 'మేము చనిపోయాం సార్​.. మా ఓట్లు తొలగించండి..!'

Multiple votes on the same household name: నిబంధనల ప్రకారం జాబితాలోని.. ప్రతి ఓటరుకు ఇంటి నంబరు ఉంటుంది. కనిగిరి పట్టణంలోని 1వ వార్డులో మాత్రం అసలు ఇంటి నంబరు దగ్గర నో అని పెట్టి ఏకంగా 2 వందల 80 మందికి ఓట్లు ఇచ్చేశారు. కనిగిరి పట్టణంలోని పోలింగ్‌ బూత్‌ 142 పరిధిలో కొండలరావు దుకాణం ఉంది. దీనికి ఇంటి నంబరు 4 వందల 98గా వేసి వందకు పైగా ఓట్లు చేర్చేశారు. ఇదే బూత్‌ పరిధిలోని ఇందిరాకాలనీ, బీసీ కాలనీ, రాజీవ్‌నగర్‌ కాలనీల్లోని ప్రాంతాల్లో మొత్తం 2 వందల 80కి పైగా ఓట్లకు ఎలాంటి ఇంటి నంబర్లు లేవు. కనిగిరి, పామూరు, శీలంవారిపల్లి, పెద అలవలపాడు ప్రాంతాల్లో 100, 141, 263, 228 బూత్‌ నంబర్లలో రెండు సున్నాలు డోరు నంబరుపై 40 ఓట్లు, డోర్‌ నంబరు 1-1 పేరుతో 50 ఓట్లు, నో అనే పేరుతో 150 ఓట్ల వరకు నమోదై ఉన్నాయి. ఇదే ప్రాంతంలో మూడు సున్నాలు డోర్‌ నంబరుతో 70 వరకు ఓట్లను నమోదు చేశారు. 1-00గా చూపుతూ 60 వరకు ఉన్నాయి.

Telugu Desam Party fire on stolen votes: తప్పుల తడకగా ఓటర్ల జాబితా.. భారీగా దొంగ ఓట్లు..!

BLOs bowing to the pressure of political leaders: ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి పేర్లను తొలగించాల్సి ఉండగా.. ఆ ప్రక్రియ చేపట్టలేదు. పది, అయిదు సంవత్సరాల క్రితం మృతి చెందిన వారి పేర్లు కూడా ఓటర్ల లిస్టులో ఉన్నాయి. ఒక్క గార్లపేట రోడ్డులోనే ఇలాంటివి 20 వరకు ఉన్నాయి. కనిగిరికి చెందిన వీర రామకృష్ణ మృతి చెంది అయిదు సంవత్సరాలైంది. అయితే ఆయన పేరు ఉన్న ఓటరు జాబితాను పరిశీలించగా.. ఆయన ఫొటో కాకుండా మరొకరి చిత్రాన్ని మార్ఫింగ్‌ చేసి పెట్టారు. అందులో ఉన్న వ్యక్తి ఎవరో మాకు తెలియదని రామకృష్ణ బంధువులు చెబుతున్నారు.

Fake Votes in Vijayawada: ఒకే ఇల్లు.. ఆరుగురు ఉంటే 48 ఓట్లు.. తప్పులతడకగా ఓటరు జాబితా

EC mandates that volunteers should not interfere in voter conversions: ఓటర్ల మార్పు చేర్పుల్లో వాలంటీర్లు జోక్యం చేసుకోరాదని ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ కనిగిరి నియోజకవర్గంలో అది సరిగా అమలవ్వట్లేదు. వారే ఇలా ఓట్ల జాబితాలో మాయాజాలం చేసి ఉంటారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిడికి బీఎల్వోలు కూడా తలొగ్గి ఉంటున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయమై కనిగిరి ఆర్డీవో టి అజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. ఓటర్ల జాబితాలో తేడాలుంటే సరిచేస్తామని చెప్పారు.

Irregularities in Voter List దుకాణానికి ఇంటి నంబర్.. 100కి పైగా ఓట్లు!

Last Updated : Aug 28, 2023, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.