ప్రకాశం జిల్లాలో ఉల్లి ధరలు ఘాటెక్కుతున్నాయి. ఈ నెల మెుదటి వారంలో కిలో ఉల్లిపాయలు రూ.23 ఉండగా ఇప్పుడు రూ.55 కు చేరింది. చీరాల, అద్దంకిలో ఉల్లి ధర కిలోకి రూ.60 కు చేరింది. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా... వ్యాపారులపై అధికారుల నియంత్రణ లేకపోవటంతో ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరలు నియంత్రించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి
ముగిసిన సీఎం దిల్లీ పర్యటన.. నేరుగా తిరుపతికి పయనం