ETV Bharat / state

అధికార పార్టీ నాయకులకు అమ్ముడుపోయారు.. అక్రమంగా కట్టబెట్టారు - తాజా ప్రకాశం జిల్లా వార్తలు

Cattle grazing wasteland: పశువుల మేత బీడు భూమిని అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకుని కట్టడాలను నిర్మిస్తున్నారని ప్రకాశం జిల్లా కనిగిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద చంద్రశేఖరపురం గ్రామ సర్పంచ్, గ్రామస్తులు ఆందోళన చేశారు. పశువుల మేత భూమిని కాపాడాల్సిన అధికారులే అధికార పార్టీ నాయకులకు అమ్ముడుపోయి వారికి అక్రమంగా కట్టబెడుతున్నారని గ్రామ సర్పంచ్ ఆరోపించింది.

Villagers
గ్రామస్తులు
author img

By

Published : Jan 3, 2023, 8:42 PM IST

Cattle grazing wasteland: ప్రకాశం జిల్లా కనిగిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద చంద్రశేఖరపురం మండల కేంద్రానికి చెందిన గ్రామ సర్పంచ్, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. తమ గ్రామానికి చెందిన పశువుల మేత బీడు భూమిని అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకుని కట్టడాలను నిర్మిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. తమ గ్రామంలోని ప్రజానీకం వ్యవసాయ, పాడి పరిశ్రమల మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారని.. అలాంటి పశువుల మేత భూమిని కాపాడాల్సిన అధికారులే అధికార పార్టీ నాయకులకు అమ్ముడుపోయి వారికి అక్రమంగా కట్టబెడుతున్నారని గ్రామ సర్పంచ్ ఆరోపించారు. దీనిపై స్థానిక తహసీల్దార్​కు వినతి పత్రం అందించినప్పటికీ స్పందన కరువైందని కనిగిరి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం గ్రామానికి చెందిన పశువుల మేత బీడును కాపాడాలని ఆర్డీఓ సందీప్ కుమార్​కు సర్పంచ్, గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు.

పశువుల మేత బీడు భూమిని కాపాడాలంటూ రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ఎదుట చంద్రశేఖరపురం గ్రామస్థుల ఆందోళన

ఉరిలోని బీడు మీదపడి వాళ్లే ప్లాట్ల చేసుకుంటున్నారు. దీనిపై ఎమ్మార్వో కూడా మమ్మల్ని లెక్క చేయకుండా తెలియకుండా లోలోపల ప్లాట్లు, వెంచర్లు వేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల వల్ల మమ్మల్ని ఏం చేయనివ్వట్లేదు. కలెక్టర్ దీనిపై స్పందించి దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. -శ్రీరామ్​ పద్మావతి, గ్రామ సర్పంచ్

బీడులో పశువులను మేపుకొని బతికే జీవనాధారం మాది. కాని అధికార పార్టీ నాయకులు వెంచర్లు వేయడం, ప్లాట్లు వేయడం, దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. మాజీ ఎమ్మార్వోల సంతకాలు తీసుకుని అది ఆధారంగా చూపి లాక్కుంటున్నారు. కలెక్టర్ గారికైనా, ప్రభుత్వ అధికారులకైనా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము దయచేసి మా బీడు మాకివ్వండి. -గ్రామస్తులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.