ETV Bharat / state

చినుకు పడితే చిత్తడి... మంత్రి నియోజకవర్గంలో దుస్థితి

శివారు కాలనీల నిర్మాణం జరిగి దశాబ్దాల కాలం గడిచిన రోడ్ల నిర్మాణం గురించిపట్టించుకున్న దాఖలాలు లేవు. వర్షం పడితే ఇళ్ల మధ్య ఏదైనా నది ప్రవహిస్తుందన్న ఆలోచన కలుగుతుంది అక్కడ పరిస్థితి చూస్తే. పేరుకు నగరపాలక సంస్థ అయిన సీసీ రోడ్లు కనబడవు.

ఒంగోలు
author img

By

Published : Oct 19, 2019, 4:39 PM IST

చినుకు పడితే చిత్తడి... మంత్రి నియోజకవర్గంలో దుస్థితి

వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒంగోలు కొత్తపట్నం మార్గంలో ప్రస్తుత జాతీయ రహదారి వద్ద రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, జర్నలిస్ట్ కాలనీలు ఏర్పడ్డాయి. ఇంటి నిర్మాణాలు అయితే పూర్తయ్యాయి కానీ కాలనీలకు సరైన మౌలిక వసతులు కల్పించటంలో మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు విఫలమయ్యాయి.ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని కాలనీలకు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టలేదు. ఇక వర్షం పడితే ఆ కాలనీలు చెరువులను తలపిస్తాయి. కాలువలు లేకపోవటంతో ఇక నీళ్లు రోడ్ల మీద నుంచి కదిలే పరిస్థితి లేదు. దీనికి తోడు ఇప్పటికీ నిర్మాణం జరగని ప్రదేశాల్లో మురికి కూపాలు ఏర్పడి దోమలకు నిలువుగా మారాయి. చుట్టూరా నీరు చేరటంతో విషపు సర్పాలు, తేళ్లు ఇతర జంతువులు ఇళ్లలోకి చేరి కాలనీ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి.

పిల్లలని పాఠశాలలకు పంపాలన్నా భయంతో ఇంట్లోనే జాగ్రత్తగా కాపలా కాస్తున్న పరిస్థితి అనుభవిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు తమ సమస్య గురించి స్పందన కార్యక్రమంలో కలెక్టర్​కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు చెప్తున్నారు. సాక్షాత్తు మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి నియోజకవర్గంలోనే ఈ దుస్థితి ఉన్నా పరిష్కార మార్గం చూపటం లేదని కాలనీ వాసులు తెలిపారు.
మూడు కాలనీల పరిస్థితే కాకుండా శివారు కాలనీ లయిన జాషువా కాలనీ, ప్రగతి కాలనీ, బలరాం కాలనీ లలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉందని నగరవాసులు అంటున్నారు. వర్షాలు పడిన వెంటనే నగరపాలక సంస్థ అధికారులు సత్వరమే స్పందించి రోగాలబారిన పడకుండా ఆదుకోవాలని అధికారులను కోరుకొంటున్నారు.

Intro:JK_AP_NLR_06_17_HARTICULTER_NO_RAYITHILU_RAJA_PKG_VIS_.AP10134 anc ఉద్యాన శాఖ నెల్లూరు జిల్లాలో అందిస్తున్న పలు రాయితీ పథకాలు రైతులకు తెలియడం లేదు. ఉద్యాన అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యాన శాఖ రాయితీపై కూరగాయల విత్తనాలు ఇస్తున్న సంగతి కూడా రైతులకు తెలియలేదంటే పరిస్థితి జిల్లాలో ఎంత దారుణంగా ఉందో చూడాలి. పథకాలు ఇచ్చిన బడా రైతులకు తప్ప సామాన్య రైతులకు చేయడం లేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈటీవీ జైకిసాన్ కథనం. వాయిస్ ఓవర్;1 నెల్లూరు జిల్లాలో వరి సాగు తర్వాత ఉద్యాన పంటల జిల్లాలో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. అయితే రైతుల గురించి పట్టించుకోవాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అందిస్తున్న పధకాలు సామాన్య రైతులకు చేయడం లేదని రైతులు చెబుతున్నారు. ఇస్తున్న రైతులు కూడా బడా రైతులకు తప్ప పేద రైతులకు ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. ఉద్యాన శాఖ ద్వారా రాయితీ పథకాల కూడా చాలా గ్రామాలలో రైతులకు తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. బైట్ ;రైతులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్;2 ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా కూరగాయలు పండించే రైతులకు రాయితీపై ఇత్తనాలు ఇస్తుంది. అసలు ఆ విషయం తెలియక చాలామంది రైతులు బయట మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. అసలు ఉద్యాన అధికారులు మా గ్రామానికి రాలేదంటూ పలువురు రైతులు చెబుతున్నారు. బైట్స్; రైతులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్;3 నెల్లూరు జిల్లాలో ఉద్యాన అధికారులు అసలు ఉన్నారా లేదా అని అర్థం కావడం లేదని రైతు నాయకులు మండిపడుతున్నారు. జిల్లాలో ఉద్యాన శాఖ అందిస్తున్న రాయితీ వివరాలు రైతులకు తెలియడం లేదని రైతు నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామాల్లో పర్యటించి ఉద్యాన శాఖ అందిస్తున్న రాయితీలను చేయాలని కోరుతున్నారు. బైట్; నరసయ్య ,రైతు నాయకులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్;4 రాయితీ వివరాలు గురించి గ్రామాలలో ఉద్యాన అధికారులు తిరిగి తెలియజేస్తున్నారు అని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. బైట్; ప్రదీప్ కుమార్, ఉద్యాన సహాయ సంచాలకులు జిల్లా

Body:ఉద్యాన శాఖ

Conclusion:బి రాజ నెల్లూరు9394450293
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.