ప్రకాశం జిల్లా కురిచేడులో తెలంగాణ మద్యాన్ని విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను... స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. కురిచేడులో ఓ ఇంట్లో గుట్టుగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం సీసాలు దాచి ఉంచి అమ్ముతున్నట్లు సమాచారం రావటంతో వచ్చి తనిఖీలు నిర్వహించామని అధికారులు తెలిపారు. 100 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని... ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఈబీ అధికారి ఆవులయ్య తెలిపారు.
ఇదీ చదవండి: