ETV Bharat / state

రాత్రి వేళ.. అడ్డగోలుగా తవ్వి తరలించేస్తున్నారు..

ప్రకాశం జిల్లా ఎస్​ఎల్​‌ గుడిపాడు దగ్గరలోని కొండల్లో రాత్రి వేళ అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. తవ్వకాలకు ఎటువంటి అనుమతులూ లేవని తెలుస్తోంది.

illegal soil excavations
రాత్రి వేళ అడ్డగోలు తవ్వకాలు
author img

By

Published : Jan 10, 2021, 7:03 PM IST

ప్రకాశం జిల్లాలోని ఎస్​‌ఎల్​‌ గుడిపాడు సమీప కొండల వద్ద ప్రభుత్వ భూమిలో.. రెండు రోజులుగా పెద్ద ఎత్తున కొందరు మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. రాత్రివేళల్లో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి.. పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా సమీపంలోని ఓ కర్మాగారం పనులకు దానిని తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

నెల రోజుల క్రితం సదరు వ్యక్తులు తవ్వకాలు నిర్వహించగా కొందరు గ్రామస్థులు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో రాత్రి వేళల్లో తమ పని కానిస్తున్నారు. స్థానిక నాయకులు ఇందుకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మట్టి తవ్వకాలకు ఎలాంటి మైనింగ్‌ అనుమతులు లేవని తెలుస్తోంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా గత ఏడాది కూలీలు పనులు చేసిన ప్రాంతంలోనే ప్రస్తుంతం లోతుగా తవ్వకాలు చేపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: శంషాబాద్ విమానాశ్రయంలో.. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.