ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లకమ్మ నదిలో అక్రమంగా ఇసుక తవ్వి, రవాణా చేస్తున్న వాహనాలను ప్రత్యేక దళం అధికారులు అడ్డుకున్నారు. రెండు దఫాలుగా 7 ట్రాక్టర్లను సీజ్ చేసి, డ్రైవర్లను అరెస్ట్ చేశారు.
చేరుకుంపాడు సమీపంలో గుండ్లకమ్మ నదిలో పెద్దస్థాయిలో అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడనుంచి ఒంగోలుకు నిత్యం రవాణా చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక దళ జిల్లా అధికారి శ్రీనివాస చౌదరి, సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని తాలూకా పోలీసులకు అప్పగించారు.
ఇది చదవండి రంజాన్: ముస్లింలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎంపీ