ETV Bharat / state

లక్ష్మీనరసింహా.. మట్టి స్వాహా.. దేవస్థానం భూముల్లో విచ్చలవిడిగా తవ్వి విక్రయాలు

author img

By

Published : Jun 8, 2022, 8:57 AM IST

ఎక్కడ ఎర్రమట్టి కనిపించినా అధికార పార్టీ నాయకులు పాగా వేసి రాత్రికి రాత్రే తవ్వి తరలించేస్తున్నారు. కొండలు, గుట్టలు, చెరువులతోపాటు చివరికి దేవుని మాన్యం భూములనూ వదిలిపెట్టడంలేదు. జేసీబీలతో తవ్వేయడంతో భూములు రూపు కోల్పోతున్నాయి. వందల టిప్పర్లు, ట్రాక్టర్లు తిరగడంతో ఆ ప్రాంతాల్లో పచ్చని పొలాలు, రహదారులు, చెట్లు ఎర్రబారుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో పరిస్థితి ఇది.

illegal digging of sand in singarayakonda prakasam district
దేవస్థానం భూముల్లో విచ్చలవిడిగా తవ్వి విక్రయాలు

ఎర్ర మట్టి కనిపించటమే పాపమైపోయింది. అధికార పార్టీ నాయకులు పాగా వేసి.. రాత్రికి రాత్రే తవ్వి మట్టిని తరలించేస్తున్నారు. చెరువులు, కొండలతో పాటు.. చివరగా దేవుని మాన్యం భూములను సైతం వారు వదిలిపెట్టలేని దారుణ స్థితికి చేరుకున్నారు. ప్రకాశం జిల్లాలోని పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి దాదాపు 200 ఎకరాల భూములున్నాయి. ఆలయానికి కిలోమీటరు దూరంలో ఉన్న ఇవి ఎర్ర నేలలు కావడంతో అధికార పార్టీ నాయకుల కన్నుపడింది. క్రమంగా వాటిని ఆదాయవనరుగా మార్చేసుకున్నారు. సర్వే నంబరు 151లో దాదాపు 50 ఎకరాల్లో ఎర్రమట్టి తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. 15 మీటర్ల లోతు వరకు తవ్వడంతో.. ఆ భూములు వర్షపు నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి.

ఈ మండలం పరిధిలో రహదారులు, ఇటుక బట్టీలు, ఇతర అవసరాల కోసం మట్టికి డిమాండు ఉండటం, మంచి ధర పలకడంతో నిత్యం వాహనాల్లో తరలిపోతోంది. టిప్పర్‌ మట్టి రూ.8-10వేలు, ట్రాక్టర్‌ మట్టి రూ.3-4వేలు ఉంది. ఇలా ఇప్పటికే రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. అయినా రెవెన్యూ, సెబ్‌, పోలీసు అధికారులు పట్టించుకోవడంలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు పెట్టిన ఖర్చును తిరిగి రాబట్టేందుకే ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నట్లు కొందరు వైకాపా నేతలే వ్యాఖ్యానించడం గమనార్హం.

ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు.. ఆ సర్వే నంబరులో మట్టి తవ్వకాలకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ద్వారా పరిశీలించి తవ్వకాలు చేపడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. - సుజాత, సింగరాయకొండ డిప్యూటీ తహసీల్దార్‌

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.