కుటుంబ కలహాలతో..భార్యపై హత్యాయత్నం కుటుంబ విభేదాల కారణంతో..భార్యపై హత్య ప్రయత్నం చేశాడు ఓ భర్త. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె. పిట్రగుంటకు చెందిన శ్రీలత.. తన కూతుర్ని భర్త శివాజీ హింసిస్తున్నాడనని ఎమ్మెల్యే స్వామికి ఫిర్యాదు చేసింది. ఈ విషయం నచ్చని భర్త.. భార్యను అంతామొందిచాలనుకున్నాడు. శ్రీలత, ఆమె బాబాయ్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని కారుతో ఢీ కొట్టాడు. టంగుటూరు మండలం నాయుడుపాలెం జాతీయరహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో బాధితులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.ఇవీ చదవండి...కర్నూలులో రక్తమోడిన రహదారులు