ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కోనంకిలో వివాహిత దారుణ హత్యకు గురైంది. భర్తే భార్యను చంపేశాడని ఆమె తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కోనంకి లక్కవరం ఎస్సీ కాలనీలో నివాసముండే మద్దుమాల భాస్కర్, పద్మ దంపతులు.. ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా గత 6 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు. ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నారు. ఈ క్రమంలో భార్య పద్మ ప్రవర్తనపై భాస్కర్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై గత కొద్ది రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో శుక్రవారం బంధువుల ఇంట్లో శుభకార్యానికని భార్యను బైక్పై తీసుకెళ్లాడు. అయితే సాయంత్రమైనా ఇంటికి చేరుకోలేదు. కంగారుపడిన బంధువులు మార్టూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్ ఆధారంలో గాలింపు చేపట్టిన పోలీసులకు కోనంకి సమీపంలోని పొలాల్లో పద్మ మృతదేహం లభించింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అల్లుడే తమ కుమార్తెను చంపేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న భాస్కర్ కోసం వెతుకుతున్నారు.
ఇవీ చదవండి..