ఒంగోలులోని మార్కెట్లో కూరగాయలు, చేపలు, మాంసం కోసం వచ్చే వారు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఫలితంగా వైరస్ విస్తృతి పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కనిగిరిలో...
పట్టణంలో కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా.. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మేదరమెట్లలో...
కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున.. కొరిసపాడు తహసీల్దార్ లక్ష్మీ నారాయణ కరోనా కేసులు వచ్చిన ప్రాంతాలను పరిశీలించారు. గ్రామంలో శానిటైజేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఎవరైనా మాస్కులు లేకుండా తిరిగితే ఫైన్ విధించాలని సూచించారు.
ఇవీచదవండి.