ETV Bharat / state

ప్రకాశం ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు... డబ్బు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు..! - ప్రకాశంలో ఇళ్ల పట్టాల పంపిణీ

నిరుపేదలకు అందించనున్న ఇళ్ల పట్టాల పంపిణీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అసలైన లబ్ధిదారుల పేర్లు తుది జాబితాలో ఉండటం లేదని ఆందోళన చెందుతున్నారు. పట్టాలు కావాలంటే సొమ్ము చెల్లించక తప్పదనే విమర్శలూ వినిస్తున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు, మంత్రులు చెబుతున్నా...క్షేత్ర స్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది.

House lands
ప్రకాశంలో అర్హులకు అందని ఇళ్ల పట్టాలు
author img

By

Published : Jan 8, 2021, 10:52 AM IST

ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం...సింగరాయకొండ మండలంలో ఇళ్ల స్థలాలకు అధికారులు 3600 మందిని అర్హులుగా గుర్తించారు. వీటిని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా సింగరాయకొండలోపేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం భారీస్థాయిలో నిర్వహించారు. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, కలెక్టర్ పోలా భాస్కర్ పాల్గొని పట్టాలు పంపిణీ చేశారు. ఒక సింగరాయకొండలొనే 2వేల మందికి పట్టాలు ఇస్తున్నట్లు గొప్పగా చెప్పారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

అర్హుల కంటే అనర్హులకే అధికంగా ఈ ఇళ్ల పట్టాలు ఎక్కువగా అందుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల మండలం లోని శానంపూడిలో చేపట్టిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో సొంత ఇల్లు ఉన్న వారినీ అర్హులుగా ప్రకటించి పట్టాలు అందజేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

పట్టాల ఎంపిక, పంపిణీలో అర్హులకు కాకుండా నాయకులు చెప్పినవాళ్లకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలున్నాయి. కొందరు కింద స్థాయి నాయకులు లబ్దిదారుల వద్ద 5 వేల నుంచి 20 వేల వరకు తీసుకుని జాబితాలో పేరుకు సిఫారసు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థలాల కేటాయింపులో రహదారి పక్కనైతే ఒక ధర, దూరంగా అయితే మరొకటి చెప్పి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అర్హులకు 90 రోజుల్లో నివేశన స్థలం అందిస్తామని చెబుతున్న అధికారులు ఇప్ప టికైనా ఆ దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రకాశంలో అర్హులకు అందని ఇళ్ల పట్టాలు

ఇదీ చదవండీ...గోశాలకు సంబంధించిన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.