ప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిధిలోని రాయవరంలో మహిళపై హత్యాయత్నం చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్ వద్ద బుధవారం అర్ధరాత్రి రాజు అనే వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
'హోటల్ యజమానిపై'
హోటల్ యజమానురాలు రమణమ్మపై నిందితుడు రాజు కత్తితో గొంతుపై దాడికి యత్నించగా బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : వైకాపా అభ్యర్థి, వాలంటీర్లపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం: సునీల్ దేవధర్