ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒంగోలు పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నఈశ్వరరావు మరణించాడు. శనివారం ఇంటి గృహప్రవేశానికి సరుకులు తీసుకొచ్చేందుకు ద్విచక్ర వాహనంపై మద్దిపాడు వైపు వెళ్తుండగా... దొడ్డవరప్పాడు వద్ద పెట్రోల్ అయిపోయింది. రహదారి పక్కన వాహనాన్ని ఆపి స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా... వెనక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. ఎస్సై పాండురంగారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి.. మోదీతో ఎంపీలు భేటీ... భవిష్యత్తుపై చర్చ