ETV Bharat / state

ఒంగోలులో 'హైటెన్షన్'... భయంతో వణికిపోతున్న ప్రజలు - high tension electrical wires

ఒంగోలు పట్టణ ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చి పడుతుందో అని క్షణం... క్షణం భయంతో గడుపుతున్నారు. దీనికంతటీకి కారణం పట్టణంలో ప్రధాన కాలనీల మీదుగా ఎప్పుడో వేసిన హైటెన్షన్‌ విద్యుత్తు లైన్‌. దీని కారణంగా.. ఇప్పటికే 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఒంగోలు
author img

By

Published : Jul 12, 2019, 10:18 PM IST

ఒంగోలులో 'హైటెన్షన్'

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు పట్టణంలోని రాజీవ్‌ నగర్, నిర్మల్‌ నగర్‌, అంజయ్య రోడ్డు, వీఐపీ రోడ్డు.. తదితర ప్రాంతాల్లో వేలాది ప్రజలు జీవిస్తున్నారు. వ్యాపార సంస్థలు, రాజకీయ ప్రముఖలు, పారిశ్రామిక వేత్తలకు ఈ ప్రాంతంలోనే శాశ్వత నిర్మాణాలు ఉన్నాయి. ఇలాంటి జనావాసాల మధ్య ఓ హైటెన్షన్‌ విద్యుత్తు లైన్‌ ప్రజలను నిత్యం భయాందోళనకు గురిచేస్తోంది.

దాదాపు 3 దశాబ్దాల క్రితం ఒంగోలు పట్టణంలో 132కేవీ హైటెన్షన్‌ విద్యుత్తు లైన్ ఏర్పాటు చేశారు. మంగమూరు రోడ్డు సబ్‌ స్టేషన్‌ నుంచి కర్నూల్‌ రోడ్డు సబ్‌ స్టేషన్‌ వరకూ 2.5 కిలోమీటర్ల మేర విద్యుత్తు టవర్లు వేసి లైన్‌ ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ లైన్‌కు ఎలాంటి ఇబ్బంది ఏర్పడలేదు. పట్టణం అభివృద్ధి చెందుతున్నందున ఈ హైటెన్షన్‌ లైన్ ఉన్న ప్రాంతం నివాసాల మధ్యకు వచ్చినట్లు అయ్యింది. విద్యుత్తులైను దగ్గరగా, దిగువున ఉన్నందున ఇళ్లపై అంతస్తులు వేసుకోడానికి వీలు ఉండటం లేదు. కనీసం మేడ మీదకు వెళ్లి బట్టలు ఆరబెట్టుకోడానికీ స్థానికులు వణికిపోతున్నారు.

అప్పట్లో రాగి లైన్‌ వున్నా, కాలక్రమంలో అల్యూమినియం లైన్‌ వేశారు. ఇది మరీ ప్రమాదంగా తయారయ్యింది. ఒక్కోసారి తీగలు వేలాడుతూ ఇళ్ళకు తాకుతున్నాయి. ఇళ్లల్లోకి విద్యుత్తు ప్రవేశించి గృహోపకరణాలు కాలిపోతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ హైటెన్షన్ విద్యుత్ లైన్ కారణంగా... ప్రమాదాలు సంభవించి ఈ మూడు దశాబ్దాల్లో సుమారు 25 మంది వరకూ మరణించారు. ఎంతో మంది క్షతగాత్రులయ్యారు.

గతంలోనే ఈ విద్యుత్తు లైను వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని, భూగర్భ విద్యుత్తు లైన్‌ వేయాలనే పలు ప్రతిపాదనలు వచ్చినా ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. దీర్ఘకాలిక సమస్య పట్ల ఒంగోలు ఎమ్మెల్యే, విద్యుత్తు శాఖ మంత్రి అయిన బాలినేని శ్రీనివాసరావే పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.

Baramulla (J-K), July 10 (ANI): Over 5500 Kashmiri youth took part in a recruitment drive organised by the Indian Army at Pattan in Jammu and Kashmir's Baramulla on Wednesday. While speaking to ANI, one of the Army aspirants said, "I am passionate to join Indian Army and it's my dream too. I cleared the first step to join the Army." "In Kashmir, we are facing lot of unemployment. I am happy and my selection also helps to support my family," another aspirant said. The recruitment rally has started today and will continue till July 16. Successful candidates will then undergo written test.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.