ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని పట్టించుకోకుండా రహదారుల మధ్యలో విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటే అధికారులు ఏంచేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. వారి తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పాలక సంస్థ పరిధి కర్నూలు రోడ్డు, నవభారత్ భవనం వద్ద.. ప్రైవేటు వ్యక్తులు రహదారి మధ్యలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటుకు తలపెట్టిన చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విగ్రహం ఏర్పాటు చేయకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని తేల్చిచెప్పింది. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనరు తదితరులకు నోటీసులు జారీచేసింది.
కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. డివైడర్‌ను పగలగొట్టి దారికి అడ్డంగా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం పెట్టేందుకు సాగుతున్న చర్యలను నిలువరించాలని అధికారులకు విన్నవించినా చర్యలు లేవని పేర్కొంటూ ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ్‌విమల్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
ఇదీ చదవండి: