ETV Bharat / state

Jumbo Fish: అక్కడ అన్నీ జంబో చేపలే.. ఎక్కడో తెలుసా..? - Heavy weighted fish caught by fishermen in veerannapalem

చెరువు (pond)ల్లో సాధారణంగా కిలో నుంచి రెండు, మూడు కిలోల బరువున్న చేపలు (Fish) దొరుకుతాయి. కొన్ని తటాకాల్లో అయితే ఇంత కన్నా ఎక్కువ బరువున్న మత్స్యాలు లభ్యమవుతాయి. కానీ.. ఓ చెరువులో మాత్రం మత్స్యకారులకు దొరికిన ప్రతి చేపలు కూడా పది కిలోలకు పైగా బరువున్నాయి. ఇంత భారీ చేపలు దొరుకుతుండటంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ చెరువు ఎక్కడుందో తెలుసా..?

వీరన్నపాలెం చెరువు
వీరన్నపాలెం చెరువు
author img

By

Published : Jul 6, 2021, 8:58 PM IST

Updated : Jul 6, 2021, 9:08 PM IST

వీరన్నపాలెం చెరువు

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం చెరువులో సహజసిద్ధంగా పెంచిన చేపలను మూడేళ్ల విరామంలో వేలం ద్వారా విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్... ఆదివారం నుంచి జాలర్లు చేపలు పడుతుండగా.. 30, 25, 23 కిలోల బరువు ఉన్న మత్స్యాలు వలలకు చిక్కాయి.

అంతే కాకుండా.. మత్స్యకారులకు దొరికిన ప్రతి చేప కూడా పది కిలోలకు పైగా బరువుంది. ముఖ్యంగా 30 కిలోల బరువున్న చేప అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంత పెద్ద మీనాలను చెరువుల్లో చూడటం ఇదే మొదటిసారి అని గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

విశాఖ: అనకాపల్లి వద్ద కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఇద్దరు మృతి

Last Updated : Jul 6, 2021, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.