ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడులో గురువారం సాయంత్రం వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షంతో మిరప, బార్లీ, వరి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చిపై పట్టాలు కప్పడానికి ఆన్నదాతలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈదురు గాలుల ప్రభావంతో కొన్నిచోట్ల ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు నేలకూలాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఈ అకాల వర్షానికి దెబ్బతిని పాడవుతుందేమోనని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.
ఇదీచదవండి.