ETV Bharat / state

ఆయన ఆత్మస్థైర్యానికి.. నేలతల్లి చేస్తుంది సలాం - ప్రకాశం జిల్లాలో కాలులేని వ్యక్తి వ్యవసాయం

సాగులో నష్టం వచ్చిందనో..అప్పుల బాధతోనో.. బోర్లలో నీరు పడలేదనో.. ఎంతోమంది రైతన్నలు తనువు చాలిస్తున్న రోజులివి.! అలాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారో రైతు. అంగవైకల్యం వెక్కిరించినా.. ఆత్మస్థైర్యమే అండగా ఒంటికాలితో సేద్యం చేస్తున్నారాయన.

hanicapped person ploughing at prakasham district
అంగవైకల్యం ఉన్నా.. ఆత్మస్థైర్యంతో సాగు
author img

By

Published : Jan 7, 2021, 7:18 PM IST

అన్నీ బాగున్నా గంటకింత చొప్పున ట్రాక్టర్లు, యంత్రాలతో దుక్కి దున్నిస్తున్న కాలమిది.! పొలం చదును చేయడం నుంచి కోత వరకూ.. యంత్రాలే నిమిషాల్లో పూర్తి చేసే స్థాయి. అయితే సాగుపై ప్రేమో లేక కాడెద్దులు మాట వింటాయన్న ఆత్మవిశ్వాసమో..., ఈ రైతు పొలం దున్నడం మాత్రం చాలా ప్రత్యేకం.! అంగవైకల్యం ఉన్నా పొలం విషయంలో ముందే ఉంటున్నారు మద్దిలేటి.

మద్దిలేటి స్వస్థలం కర్నూలు జిల్లా కోడుమూరు. పదహారేళ్ల వయసులో.. ఎద్దుల కాడి మీద పడి సెప్టిక్‌ కావడం వల్ల వైద్యులు కాలు తొలగించారు. వాస్తవానికి పుట్టుకతో వచ్చే అంగవైకల్యం కన్నా.. మధ్యలో వచ్చే వైకల్యం కలిగించే బాధ భరించడం కష్టం. ఆ వ్యథను దిగమింగుతూ.. ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని జయిస్తూ సాగులో ఆనందం వెతుక్కుంటున్నారీయన.

తన నాలుగున్నర ఎకరాల్లో సేద్యం చేస్తున్న మద్దిలేటి కాడెద్దులతో ఇతర పొలాల్లోనూ దున్నేందుకు బాడుగకు వెళ్తున్నారు. అందుకు భార్య గంగమ్మ, కుమారుడు శివ సాయంగా ఉంటున్నారు. ప్రకృతి కరుణిస్తే పంట.. లేదంటే బాడుగులకు వెళ్తే వచ్చే డబ్బుతోనే కుటుంబ పోషణ.

సాగునే నమ్ముకున్న రైతు మద్దిలేటికి ప్రభుత్వం ట్రాక్టర్‌ లేదా వ్యవసాయ రుణం ఇప్పించాలని బంధువులు కోరుతున్నారు. మద్దిలేటి నాలుగున్నర ఎకరాల పొలం వర్షాధారం కావడం వల్ల ఏటా ఒక్క పంట సాగు మాత్రమే వీలవుతోందని ఆయన చెబుతున్నారు.

అంగవైకల్యం ఉన్నా.. ఆత్మస్థైర్యంతో సాగు

ఇదీ చదవండి : ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటున్న చిట్వేల్- రాపూరు రోడ్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.