ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని పోకర్ణ గ్రానైట్స్ లో ప్రమాదవశాత్తు బాంబు పేలింది. గ్రానైట్ రాళ్లు పగలగొట్టేందుకు బ్లాస్టింగ్ హెల్పర్ వెంకట్రావు బాంబును అమరుస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో వెంకట్రావుకు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఒంగోలు తరలిస్తుండగా పెద్ద స్థాయిలో రాళ్లు ఎగిరి పడ్డాయి. పక్కనే ఉన్న మరో కార్మికులపై పడ్డాయి. వారిలో నాగరాజు అనే కార్మికుడికి తలకు బలమైన గాయాలయ్యాయి. అతనికి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సీఐ దుర్గా ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి.