బోర్లు, బావుల కింద బిందు, తుంపర, సూక్ష్మ సేద్యాలను ప్రశ్నార్ధకం చేసేలా ప్రభుత్వం విధానాలను అమలు చేస్తోందని.. ప్రకాశం జిల్లా ఒంగోలులో రైతుల నిరసనకు దిగారు. సాగుకు ఉచిత విద్యుత్ అందిస్తూ.. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి ఆద్వర్యంలో నిర్వహించిన ధర్నాకు పెద్ద సంఖ్యలో రైతులు, నాయకులు హాజరయ్యారు.
ఉచిత విద్యుత్ అమలు చేస్తామని చెబుతూ విద్యుత్ మీటర్లు బిగించడం అన్యాయం అని అన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన విధానాన్నే కొనసాగించాలని వారు కోరారు. మీటర్లు ఏర్పాటు చేస్తే నిబంధనలు, షరతులు వర్తిస్తాయని.. రైతులను ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: