Ongole Market Yard: జిల్లా కేంద్రం, 30 మండలాలకు చెందిన రైతులకు సలహాలు, సూచలు అందించే ఏరువాక కేంద్రం తరలిపోతుంది.. తూర్పు ప్రకాశం ప్రాంతంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేసే రైతులకు నిత్యం వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సహకారాలు అవసరం.. తెగుళ్ళు వచ్చినా, కొత్త రకాల వంగడాలకు రైతులకు పరిచయాలు చేయాల్సి వచ్చినా, వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు విధానంలో చేపట్టాల్సిన మార్పులు గురించి తెలుసుకోవాలన్నా రైతులు ఏరువాక కేంద్రానికి వెళ్ళి సమస్యలను నివృతి చేసుకుంటారు.. అలాంటి ఏరువాక కేంద్రం ఇప్పుడు వేరే జిల్లాకు తరలిపోతుండటం రైతుల్లో ఆందోళన మొదలయ్యింది.
ప్రకాశం జిల్లా ఒంగోలు మార్కెట్ యార్డు ఆరవణలో 1998లో జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా కేంద్రం (డాట్ సెంటర్-ఏరువాక) పరిశోధన కేంద్రం ఏర్పాటయ్యింది. ఈ డాట్ సెంటర్ పరిధిలో ఉమ్మడి ప్రకాశంలో అటు కందుకూరు నుంచి ఇటు కారంచేడు, పర్చూరు వరకూ దాదాపు 30 మండలాల రైతులు సేవలందించేవారు. సీనియర్ శాస్త్రవేత్త సమన్వయంతో ఇద్దరు జూనియర్ శాస్త్రవేత్తలు, క్షేత్ర సిబ్బంది పనిచేస్తారు.. ఆధునిక వంగడాలు, తెగుళ్ళు నివారణ, పంటలకు సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్దతులు, రైతు శిక్షణలు వంటి కలాపాలు ద్వారా రైతులకు సేవలందిస్తున్నారు.. దర్శిలో కృషి విఙ్ఙాన కేంద్రం ఉన్నప్పటికీ 30 మండలాల రైతులకు ఈ ఒంగోలు కేంద్రం అనుకూలంగా ఉండేది.. గుంటూరులో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఈ కేంద్రాన్ని తాజాగా పల్నాడు జిల్లా నరసరావు పేటకు తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. సిబ్బందితో పాటు తరలిపోతే తమకు సలహాలు, సూచనలు ఎవరు చేస్తారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాల విభజనతో అనేక కార్యాలయాల మార్పులు చేర్పులు చేస్తుండటంతో ఏరువాక కేంద్ర కూడా తరలిపోయే పరిస్థితి ఏర్పడింది.. కొత్త జిల్లాలు వల్ల కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయాలి గానీ.. ఉన్న వాటిని తరలించడం భావ్యం కాదని నరసరావు పేటకు కొత్తగా ఏరువాక కేంద్రం మంజూరు చేయాలని రైతు సంఘాలు ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఏరువాక కేంద్రాన్ని ఒంగోలు లో కొనసాగించాలని పలువురు కోరుతున్నారు.
ఇవీ చదవండి: