ప్రకాశం జిల్లా చిన్నగంజాం, పెద్దగంజాం మధ్య దశాబ్దకాలంగా కొనసాగుతున్న వారధి సమస్యకు తెలుగుదేశం ప్రభుత్వం స్వస్తి పలికింది. రొంపేరు కాలువపై 13 కోట్లతో వంతెన నిర్మించి వారి కల సాకారం చేసింది.
రాష్ట్రవిభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా ఏలూరు సాంబశివరావు పెద్ద గంజాం వచ్చి ప్రజలకు హామీ ఇచ్చారు. నాటు పడవల్లో ప్రయాణించి ప్రాణాలు కోల్పోతున్న వారి ఆవేదన అర్థం చేసుకొని మాటిచ్చారు. తనను గెలిపిస్తే వంతెన నిర్మాణం పూర్తి చేసి వచ్చే ఎన్నికల్లో అదే వంతెనపై నడుచుకుంటూ వచ్చి ఓట్లు అడుగుతానని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సమస్యను పరిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సహాయంతో ఎన్టీఆర్ వారధి నిర్మించారు.