ETV Bharat / state

మార్కాపురంలో 14 రోజులపాటు పూర్తి లాక్​డౌన్ - మార్కాపురంలో కరోనా పాజిటివ్ కేసులు

ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటికే ఒంగోలు, చీరాలలో లాక్​డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్ పోలా భాస్కర్ ప్రకటించారు. అదే తరహాలో మార్కాపురంలోనూ కోవిడ్ పాజిటివ్ కేసులు విజృంభించడంతో.. అక్కడ కూడా 14 రోజులపాటు పూర్తి లాక్​డౌన్​ను విధిస్తున్నట్లు ఆర్డీఓ శేషిరెడ్డి తెలిపారు.

Full lockdown for 14 days in Markapuram
మార్కాపురంలో 14 రోజులపాటు పూర్తి లాక్​డౌన్
author img

By

Published : Jun 24, 2020, 12:30 PM IST

ప్రకాశం జిల్లాలో కోవిడ్ ఉద్ధృతి పెరుగుతోంది. జిల్లాకు వచ్చే కేసులన్నీ చాలావరకు ఇతర పట్టణాల నుంచే వస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఒంగోలు, చీరాలలో పూర్తి లాక్​డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్ పోలా భాస్కర్ ప్రకటించారు. మార్కాపురంలోనూ కోవిడ్ పాజిటివ్ కేసులు విజృంభించడంతో.. అక్కడ కూడా 14 రోజులపాటు పూర్తి లాక్​డౌన్​ను విధిస్తున్నట్లు ఆర్డీఓ శేషిరెడ్డి తెలిపారు మార్కాపురం మండలంలోనే 7 కేసులు నమోదయ్యాయి. వారందరినీ ఒంగోలు రీమ్స్​కు తరలించారు. వారిలో ఇద్దరి కానిస్టేబుళ్లకు కూడా కరోనా పాజిటివ్ రావడంతో.. పట్టణ వాసుల్లో ఆందోళన నెలకొంది. ఉదయం 6 నుంచి 10 వరకు మాత్రమే నిత్యావసర దుకాణాలకు అనుమతి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి. తెదేపా శ్రేణులపై అక్రమ కేసులను సహించేది లేదు: అఖిల ప్రియ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.